డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ కేసులో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అతిపెద్ద పురోగతి సాధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ ‘సీక్రెట్’ బ్యాంకు అకౌంట్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్ కనిపెట్టేసింది. లండన్‌లోని బార్క్లేస్ పీఎల్‌సీ బ్యాంక్‌లో నీరవ్‌కు ఈ అకౌంట్ ఉన్నట్టు ఐటీ డిపార్ట్‌మెంట్ గుర్తించింది.