ధోనీ, యువరాజ్ ఫ్రెండ్స్ అయ్యారా..! | Yuvraj Singh and MS Dhoni are good friends are not | Sakshi
Sakshi News home page

Jan 11 2017 2:26 PM | Updated on Mar 22 2024 11:32 AM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి, డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్కు మధ్య ఎన్నో విభేదాలున్నాయని గతంలో ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే వీటికి తాజా వీడియో సమాధానం చెబుతుందని ఆశించవచ్చు. మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా-ఏ జట్టుపై ఇంగ్లండ్ నెగ్గిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత యువీ,ధోనీ భుజంపై చెయ్యి వేసి సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగాడు. మరికొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. యువీ తన ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. వెల్ డన్ ధోనీ.. నీ కెప్టెన్సీలో మూడు మేజర్ టోర్నీలు నెగ్గగా, అందులో రెండు వరల్డ్ కప్ లున్నాయని ధోనిని ప్రశంసించాడు.అతడి కెప్టెన్సీలో ఆడటం చాలా గొప్పవిషమని వ్యాఖ్యానించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement