కొత్త ప్రయోగాలు చేయకుండా... సాహసోపేత ఎత్తులు వేయకుండా... ఆద్యంతం ఆచితూచి ఆడటంతో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్ (భారత్), మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)ల మధ్య తొలి గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 48 ఎత్తుల ఆనంతరం గేమ్‌లో ఫలితం తేలే అవకాశం లేదని భావించిన ఆనంద్, కార్ల్‌సన్ ‘డ్రా’కు అంగీకరించారు.