మహిళా టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజ క్రీడాకారిణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సెరెనా విలియమ్స్ త్వరలోనే పెళ్లికూతురు కానుంది. ఇంటర్నెట్‌లో సామాజిక వార్తల కలబోతగా చెప్పుకునే రెడిట్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు 32 ఏళ్ల అలెక్సిస్ ఒహానియాన్‌తో గురువారం తన నిశ్చితార్థం జరిగింది.