భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తొలిసారి ఫైనల్‌లోకి ప్రవేశించారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోవ్‌లో జరుగుతున్న పోటీల్లో శనివారం రాత్రి జరిగిన రెండో సెమీస్‌లో చైనాకు చెందిన జూనియర్ ఛాంపియన్ చెన్ యుఫీపై 21-13, 21-10 తేడాతో సింధు ఘన విజయం సాధించారు.