న్యూజిలాండ్ గడ్డపై ధోని సేనకు వరుసగా రెండో పరాభవం ఎదురయింది. కివీస్తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి పాలయింది. బుధవారమిక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ పరుగుల తేడాతో ఓడిపోయింది. 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 41.3 ఓవర్లలో 277 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయినట్టు ప్రకటించారు.