బాక్సింగ్ స్టార్ ఫ్లాయిడ్ మేవెదర్ ప్రపంచ వెల్టర్ వెయిట్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆండ్రీ బెర్టోతో జరిగిన పోరులో మేవెదర్ విజయం సాధించాడు. మేవెదర్ కెరీర్లో ఇది 49-0 రికార్డు విజయం. హెవీ వెయిట్ లెజెండ్ రాకీ మార్కియానో రికార్డును సమం చేశాడు. ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ బౌట్ అనంతరం మేవెదర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు దశాబ్దాల పాటు ఓటమే లేకుండా కెరీర్ కొనసాగించిన మేవెదర్.. ఇక తన కెరీర్ ముగిసిందని అధికారికంగా ప్రకటించాడు. వినోద రంగం లో కూడా అడుగు పెట్టాలని భావిస్తున్న మేవెదర్‌కు ఇప్పటికే మూడు సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే గతంలోనూ 2008లో రిటైర్మెంట్ ప్రకటించినా... మళ్లీ రింగ్‌లోకి వచ్చాడు. మేవెదర్ ఇంకో బౌట్ ఆడి తన స్కోరును 50 చేస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
Sep 13 2015 5:36 PM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement