ఆసియాకప్ హాకీ టోర్నీలో నేడు(ఆదివారం) జరిగిన అసలు సిసలు పోరులో చిరకాల పత్యర్థి పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం సాధించింది. చివరిలీగ్ మ్యాచ్‌లో 3-1తో గెలిచి సగర్వంగా సూపర్-4 దశకు చేరింది. కొత్త కోచ్ జోయెర్డ్ మరీన్ సారథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు జపాన్, బంగ్లాదేశ్, పాక్‌లపై వరుసగా గెలుపొంది టోర్నిలో జైత్రయాత్రను కొనసాగిస్తోంది.