ఓటుకు కోట్లు కేసు ప్రజాస్వామ్యానికే మచ్చలాంటిదని... ఆ అంశంపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. ఈ కేసులో టీడీపీ నేతలు రెడ్హ్యాండెడ్గా దొరికినా కేసును నీరుగార్చేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ... పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు