కొత్త అధ్యక్షుడి పాలనలోకి వచ్చిన శ్వేతసౌధం ఘోరమైన తప్పిదం చేసింది. త్వరలోనే తమ దేశంలో పర్యటించబోతున్న బ్రిటిష్ ప్రధాని థెరెసా మే పేరుకు బదులు ఒక పోర్న్ స్టార్ పేరును అధికారిక షెడ్యూలులో ప్రచురించింది. అది కూడా ఒకసారి కాదు.. ఏకంగా మూడుసార్లు ఆ పేరును మార్చేసింది. డోనాల్డ్ ట్రంప్ వద్ద ఉన్న అధికారుల్లో ఒకరు ఆ షెడ్యూలుకు సంబంధించిన పత్రంలో థెరెసా మే పేరు రాసేటపుడు అందులోని 'హెచ్' అనే అక్షరాన్ని వదిలేశారు. దాంతో అది కాస్తా టెరెసా మే అయిపోయింది. అదే పేరుతో ఒక పోర్న్ స్టార్ ఉన్నారు. వాసత్వానికి థెరెసా మే తన అధికారిక పర్యటనలో భాగంగా ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడంతో పాటు సంయుక్త విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది.