కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందేందుకు సహకరించాలని వారిని వెంకయ్య కోరారు.