14 నెలల కిందట ఐసిస్ తీవ్రవాదుల చేతుల్లో బందీలుగా చిక్కుకున్న హైదరాబాద్‌కు చెందిన తెలుగు ప్రొఫెసర్లు చిలువేరు బలరాంకిషన్, తిరువీధుల గోపీకృష్ణ ఎట్టకేలకు విడుదలయ్యారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తమ కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి తాము క్షేమంగా విడుదలయ్యామని, ప్రస్తుతం మిలటరీ రక్షణలో ఉన్నామని చెప్పారు. లిబియాలోని ట్రిపోలీకి 250 కి.మీల దూరంలో ఉన్న తాము భారత దౌత్య అధికారులను కలిశాక హైదరాబాద్ వస్తామన్నారు.