నగదు మార్పిడి కోసం ఇటీవల అనంతపురం నగరంలోని సారుునగర్ స్టేట్‌బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వద్దకు వెళ్లిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డిపై దాడి చేసిన ఘటనలో త్రీటౌన్ సీఐ గోరంట్ల మాధవ్‌ను వీఆర్(పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచడం)కు పంపుతూ పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు ఈ ఘటన ఎలా చోటుచేసుకుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓవైపు డ్యూటీలో ఉన్న ఎస్‌ఐపై మాధవరెడ్డి దాడి చేశారని, మరోవైపు ఎస్‌ఐ జనార్దనే మాధవరెడ్డిపై దాడి చేస్తుండగా అతడు ప్రతిఘటించాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 13న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అనంతపురం స్టేట్ బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు.
Nov 20 2016 7:18 AM | Updated on Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement