ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు బుధవారం తిరుమలలో ‘తెలంగాణ’ మొక్కులు చెల్లించారు. కుటుంబ సభ్యులు, స్పీకర్, మంత్రులతో కలసి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని.. రూ.5 కోట్ల విలువైన స్వర్ణ సాలగ్రామ హారం, ఐదు పేటల స్వర్ణ కంఠాభరణాలను సమర్పించారు. తిరుగు ప్రయాణంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బంగారు ముక్కు పుడకను కానుకగా సమర్పించారు.