నంద్యాల: ఎమ్మెల్యే వాహనంలో మంత్రులు | TDP Leaders Staying in Kurnool District | Sakshi
Sakshi News home page

Aug 22 2017 4:33 PM | Updated on Mar 21 2024 8:52 PM

ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. బనగానపల్లె కేంద్రంగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మంత్రులు అమర్‌నాథ్‌ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో బసచేశారు. ఇతర జిల్లాల నేతలు కర్నూలు విడిచి వెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశించినా లెక్కచేయడం లేదు. మరికొంత టీడీపీ నాయకులు ఆళ్లగడ్డలో తిష్టవేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కర్నూలు జిల్లాలో మంత్రులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి వాహనం(ఏపీ 21 బీఎల్‌ 9999)లో తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు పలు లాడ్జిల్లో మకాం వేసి నంద్యాలలో మంత్రాంగం నడుపుతున్నారు. నంబర్‌ ప్లేట్‌ లేని ఫార్చ్యునర్‌ కారులో మంత్రి ఆదినారాయణరెడ్డి ఆళ్లగడ్డలో హల్‌చల్‌ చేయడం మీడియా కంటపడింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement