తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ‘వర్దా’ నష్టం కింద రాష్ట్రానికి రూ.22వేల 573 కోట్లు ఇవ్వాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల వర్దా తుపాను కారణంగా రాష్ట్రానికి కలిగిన నష్టంపై సాయం చేయాల్సిందిగా విన్నవిస్తూ ఈ సందర్భంగా ఓ మెమోరాండం సమర్పించారు.