తమిళనాడు కేబినెట్ అత్యవసర భేటీ | tamilnadu cabinet meeting about cm Jayalalithaa health issues | Sakshi
Sakshi News home page

Dec 5 2016 7:57 AM | Updated on Mar 21 2024 7:52 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆమెను ఐసీయూ విభాగంలోకి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అపోలో చైర్మన్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఫోన్ చేశారు. జయలలిత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదివరకే జయ ఆరోగ్యంపై తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ఫోన్ చేసి సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement