జీఎస్టీ బిల్లుకు మద్దతివ్వండి | Support the GST bill | Sakshi
Sakshi News home page

Jul 18 2016 6:38 AM | Updated on Mar 22 2024 11:05 AM

‘అన్ని సమస్యలను పక్కనపెట్టండి.. జాతీయ ప్రయోజనాలనే మిన్నగా భావించండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు మద్దతివ్వాలని ఆయన అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మనం ప్రజలకు, రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం.అందువల్ల మిగిలినవన్నీ పక్కనపెట్టి జాతీయప్రయోజనాలే మిన్నగా భావించాలి’’ అని ప్రధాని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ ప్రసంగించారు. జీఎస్టీ బిల్లు సహా పలు కీలకబిల్లులు ఈ సమావేశాలలో ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని స్వయంగా విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement