మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని ఆరోపించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆ వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని, లేనిపక్షంలో పరువునష్టం కేసులో విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సంఘ్ పేరును ప్రస్తావించకుండా యావత్తు సంస్థపైనే ఏకంగా నేరారోపణలు చేయకూడదని జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్‌ల బెంచ్ పేర్కొంది. ఆరోపణలు చేసేటప్పుడు ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలంది.