నైజీరియా దేశస్తుడైన తుచుక్వో చిజియోకో అనే వ్యక్తి వద్ద 53.78 లక్షల కొత్త కరెన్సీని, రూ. 4.29 లక్షల పాత కరెన్సీని సీఐఎస్‌ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఇండిగో విమానంలో అతడు వచ్చాడు. భారీ మొత్తంలో కరెన్సీ దొరకడంతో సీఐఎస్‌ఎఫ్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.