తమిళనాడులో గురువారం పెను ప్రమాదం చోటుచేసుకుంది. కోయంబత్తూరులోని సోమనూరు బస్టాండ్ పై కప్పు కూలి తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీసి చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.