పెద్ద నోట్ల రద్దుతో అక్రమార్కుల నల్లధనం నిల్వలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీ సర్కారు.. తాజాగా మహిళల నగల పెట్టెపై దృష్టి పెట్టింది. నోట్ల రద్దు అనంతరం పెద్దమొత్తంలో నల్లధనాన్ని బంగారం, ఆభరణాల కొనుగోలుకు వినియోగించారన్న వార్తల నేపథ్యంలో.. బంగారం, ఆభరణాల వ్యక్తిగత నిల్వలపై పరిమితులు విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో మహిళలు సహా అన్ని వర్గాల్లో ఆందోళనలు వెల్లువెత్తడంతో..