పోలీసులు అదుపులో 300 మంది అనుమానితులు | Police took 300 suspected people into custody in hyderabad city | Sakshi
Sakshi News home page

Sep 21 2013 8:52 AM | Updated on Mar 21 2024 6:14 PM

ఈ రోజు తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న గౌహతి ఎక్స్ప్రెస్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం దాదాపు 300 మంది ప్రయాణీకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరిని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అక్రమంగా వలస వస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో అధికమైందని నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. తమ ఆదుపులో ఉన్న వారికి ఉగ్రవాద కార్యకలాపాలతో ఏమైన సంబంధాలు ఉన్నాయా లేదా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. పూర్తి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడించగలమని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement