పెద్ద నోట్ల రద్దు విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సమస్య కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, కానీ దాని అనంతరం వచ్చే ప్రయోజనాలు మాత్రం దీర్ఘకాలం ఉంటాయని చెప్పారు. దేశాన్ని ఆర్థిక పురోభివృద్ధిలోకి వేగంగా తీసుకెళ్లేందుకే తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప తాత్కాలికంగానే పనికొచ్చే రాజకీయ లబ్ధి కోసం కాదని అన్నారు. ఒకే తరంలోనే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడమే తన కల అని చెప్పారు.