గ్రేటర్లో విలీనానికి నిరసిస్తూ నార్సింగ్లో మహాధర్నా | Mahadarna at Narsingi village | Sakshi
Sakshi News home page

Sep 14 2013 11:42 AM | Updated on Mar 22 2024 11:04 AM

నగర శివారుల్లోని 17 గ్రామ పంచాయితీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో విలీనం చేయడంపై అయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని అయా గ్రామాల ప్రజలు శనివారం నార్సింగ్లో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో దుకాణదారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అలాగే పాఠశాలను కూడ మూసివేశారు. ఆ బంద్కు మద్దతుగా 17 గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో శనివారం ఉదయం నార్సింగ్ చేరుకుని మహాధర్నాలో పాల్గొన్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసు బలగాలను మెహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement