ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్సభ ఆమోదించింది. సీమాంధ్ర సభ్యుల గందరగోళం మధ్య మూజువాణి ఓటు ద్వారా తంతును ముగించారు. 23 నిమిషాలు మాత్రమే సభలో బిల్లుపై చర్చ జరిగింది. బిజెపి మద్దతుతో సభలో బిల్లుకు ఆమోదం లభించింది. రెండు రోజులలో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు.