‘బాహుబలి’పై ఐటీ దాడులు | "IT attacks on bahubali | Sakshi
Sakshi News home page

Nov 12 2016 7:16 AM | Updated on Mar 21 2024 6:13 PM

బాహుబలి సినీ నిర్మాతలు, కార్యాలయాలపై శుక్రవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగాయి. ఆర్కా మీడియా పతాకంపై నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కార్యాలయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.2 ఉండగా, నిర్మాత శోభు యార్లగడ్డ నివాసం ఫిలింనగర్‌లో, మరో నిర్మాత ప్రసాద్ దేవినేని ఇల్లు జూబ్లీహిల్స్‌లో ఉంది. 25 మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి ఈ మూడు చోట్ల ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో రూ.60 కోట్ల మేర రద్దయిన పాత నోట్లను గుర్తించినట్లు సమాచారం. అలాగే సినిమాకు సంబంధించిన రశీదులు, కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement