రఫెల్ యుద్ధ విమానాలు దిగుతున్నాయ్ | India, France ink deal for 36 Rafale fighter jets | Sakshi
Sakshi News home page

Sep 23 2016 7:42 PM | Updated on Mar 21 2024 9:51 AM

భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. వాయువేగంకంటే వేగంగా దూసుకెళ్లగలిగే రఫెల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత్ వాయుసేనలో అడుగుపెట్టనున్నాయి. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ఒప్పందానికి సంబంధించి శుక్రవారం చారిత్రాత్మక అడుగుపడింది. భారత్, ఫ్రాన్స్ మధ్య ఈ విమానాల కొనుగోలుకు సంబంధించి సంతకాలు అయ్యాయి. దాదాపు 7.87బిలియన్ యూరోలు(రూ.58వేల 363కోట్లు)లతో కొనుగోలు చేయనున్న రఫెల్ ఫైటర్ జెట్ విమానాలకు లైన్ క్లియర్ అయింది. శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఫ్రాన్స్ రక్షణమంత్రి జియాన్ యూలీ డ్రెయిన్ సంతకాలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement