56 బోగీలు మీద నుంచి పోయినా.. | How West Bengal Woman Survived After 56-Wagon Train Passed Over Her | Sakshi
Sakshi News home page

Jan 12 2016 5:46 PM | Updated on Mar 21 2024 9:48 AM

భూమి మీద నూకలు ఉండాలే గానీ పిడుగొచ్చి ఒళ్లోపడినా ప్రాణం పోదంటారు. సరిగ్గా పశ్చిమ బెంగాల్లో ఇలాగే జరిగింది. ఓ మహిళ పట్టాలు దాటుతుండగా అనూహ్యంగా గూడ్సురైలు దూసుకొచ్చింది. దాదాపు 56 బోగీలతో ఉన్న ఆ రైలు మీద నుంచే వెళ్లిన ఆ మహిళకు స్వల్ప గాయాలు కూడా అవలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగాల్ లోని పురూలియాలో హిమానీ మాంజి(45) అనే మహిళ తాతా నగర్ వెళ్లేందుకు తన ఇంటి నుంచి బయలు దేరింది.

Advertisement
 
Advertisement
Advertisement