విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం సందడిగా సాగింది. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రజలు బందర్ రోడ్డు పై నిర్వహించిన హ్యాపీసండే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలు, సంగీతం, నృత్యాలతో యువత అందరినీ అలరించారు.