బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తున్నామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తప్పుబట్టారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన జవహర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. బీరు హెల్త్ డ్రింక్ అంటున్నారు, మెడికల్ షాపుల్లో కూడా అమ్ముతారా అని ప్రశ్నించారు. ఏపీ సర్కారు తీసుకొచ్చిన మద్యం విధానం ప్రజలకు చేటు చేస్తుందన్నారు.