ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు ఇస్తే.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే ఆధారాలను బహిర్గతం చేస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కె.అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు హెచ్చరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్రంలో మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కలిపి 87 కేసులు నమోదయ్యాయని, ఆ కేసుల విచారణకు సీఐడీ చీఫ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు విభాగం(సిట్)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విభాగం తనకు నోటీసులు జారీ చేస్తుందనే సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు మంగళవారం తన నివాసంలో ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు.
Jun 17 2015 6:54 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement