రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా పూర్తి మెజారిటీ ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా నాయకులు అందరితోను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చర్చిస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీలోని సీమాంధ్ర సీనియర్లను పిలిచి మాట్లాడాల్సిందిగా దిగ్విజయ్ సింగ్ను కోరామని, రేపు పార్టీ సీమాంధ్ర సీనియర్లు, మంత్రులు ఢిల్లీ వస్తున్నారని ఆయన చెప్పారు. సీమాంధ్రకు ఏం చేస్తే ప్రజల్లో మంచి భావం ఏర్పడుతుందో రేపు సీమాంధ్ర సీనియర్లతో దిగ్విజయ్ చర్చిస్తారని, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అక్కడ పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు, మంత్రి పదవులకు వివిధ నాయకులు చేసిన రాజీనామాల గురించి బొత్స మాట్లాడుతూ, ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి మినహా మిగిలివారెవ్వరూ తగిన ఫార్మాట్లో తమ రాజీనామా పత్రాలను పంపలేదని ఆయన చెప్పారు.
Feb 24 2014 5:00 PM | Updated on Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement