జయలలిత ఆరోగ్యం విషమం | cm Jayalalithaa suffers with heart attack | Sakshi
Sakshi News home page

Dec 5 2016 7:30 AM | Updated on Mar 21 2024 7:52 PM

రెండున్నర నెలలుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా విషమించింది. గుండెపోటు రావడంతో జయలలితను జనరల్ వార్డు నుంచి ఐసీయూలోకి మార్చినట్లు అపోలో ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రికి ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. ఆమెకు గుండె సంబంధ నిపుణులు, అత్యవసర వైద్య చికిత్సా నిపుణులు చికిత్సనందిస్తూ పర్యవేక్షిస్తున్నారు’’అని ఆదివారం రాత్రి అపోలో హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement