తెలంగాణ టీడీపీ నేతలు అంతర్మథనంలో పడిపోయారు. పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు తీరునూ ఆక్షేపిస్తున్నారు. గడిచిన కొద్ది నెలలుగా తెలంగాణలో అసలు పార్టీ అక్కర్లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మథనపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌తో తామెక్కడ పోరాడగలుగుతాం, సీఎం కేసీఆర్‌ను ఎలా ఎదుర్కొంటామని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం మూసేయడానికే చంద్రబాబు మొగ్గుచూపుతున్నారేమోనన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.