ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు 1650 కోట్ల రూపాయలు కేటాయిస్తే, అందులో వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. పుష్కరాల సొమ్మును కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంపాదనకు ఆదాయమార్గంగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. పుష్కరాల పనుల్లో అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.