అమరావతి నిర్మాణం కోసం అమలు చేస్తున్న స్విస్ చాలెంజ్ విధానం వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్నే మార్చేసేందుకు సన్నద్ధమవుతోంది. రాజధాని నిర్మాణం పేరిట లక్షల కోట్లు అడ్డగోలుగా దోచుకోవడానికే ప్రభుత్వ పెద్దలు స్విస్ చాలెంజ్‌ను తెరపైకి తెచ్చినట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్కారు తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఏకంగా చట్టాన్నే తన చుట్టంగా మార్చుకొని, ఇష్టారాజ్యంగా చెలరేగిపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజధాని నిర్మాణంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకొని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్(ఏపీఐడీఈ)లో మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది.
Oct 6 2016 6:55 AM | Updated on Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement