తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.. తెలంగాణలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనాలి, ఏపీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు డబ్బు వెదజల్లాలి.. ఇందుకోసం రెండు చోట్లా రూ.75కోట్ల చొప్పున రూ.150కోట్లు కావాలి.. ఆ సొమ్మును ఏపీ ప్రభుత్వం నుంచి ఆయాచిత లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేయాలి.. ఇదీ స్థూలంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పన్నాగం. ఇరవై రోజుల క్రితమే రూపకల్పన చేసిన పక్కా ప్లాన్ ఇది