ఏపీ సీఎం చంద్రబాబుకు కౌంట్ కౌన్ మొదలైందని, రానున్న రోజుల్లో టీడీపీకి డిపాజిట్ కూడా రాదని వైఎస్ఆర్ సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నిరుద్యోగ భృతి హామీపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖకు చంద్రబాబు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలన్నారు. ఇవేమీ చెప్పకుండా ప్రతిపక్ష నాయకుడిపై అవాకులు చవాకులు మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.