పెద్దనోట్ల రద్దుపై యూటర్న్ తీసుకున్న చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దనోట్లు రద్దు చేయాలని అక్టోబర్ 12వ తేదీన చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని, ఆ తర్వాత నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోగా.. ఆ క్రెడిట్ ఇతరులు తీసుకుంటారేమోనన్న భయంతో రాత్రికి రాత్రే ప్రెస్‌మీట్ పెట్టి.. ప్రధానికి నోట్లు రద్దు చేయాలని చెప్పింది తానేనని చెప్పుకొన్నారని, ఇప్పుడేమో నోట్ల రద్దు మేం కోరుకున్నది కాదు, నోట్లను రద్దు చేశారంటూ సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని బుగ్గన మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.