చంద్రబాబు పరిపాలన అంతా మోసం, మోసం, మోసం అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక తొంగలో తొక్కారని ధ్వజమెత్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా బత్తులపల్లిలో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.