'రౌడీలా మాట్లాడుతున్న మంత్రి' | bosta satyanarayana fire on chandra babu naidu on special status | Sakshi
Sakshi News home page

Aug 26 2015 4:42 PM | Updated on Mar 21 2024 8:17 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతపు భూసేకరణ తప్పు అయినందునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష ధర్నాచేశారని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. నగరంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు వీధి రౌడీలలా మాట్లాడుతున్నారు. మీ తాట తీస్తాం అంటూ ఏపీ మంత్రి మాట్లాడటం సబబేనా అని ఆయన ఈ సందర్భంగా అధికార పార్టీని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఏమైనా సంజీవనా అని చంద్రబాబు వ్యాఖ్యానించటం తగదన్నారు. ప్రత్యేక హోదా అంటూ ప్రగల్బాలు పడి.. నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోక ముడిచారని వ్యాఖ్యానించారు. బాబు.. నువ్వు కూడా మంత్రిగా చేశావు, ఇలాంటి భాష మాట్లాడటడమేంటని బొత్స మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement