తీవ్రజ్వరంతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై గురువారం అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సీఎం జయలలిత నెమ్మదిగా కోలుకుంటున్నారనీ వైద్యులు తెలిపారు. త్వరలో సీఎంను డిశార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. అయితే చికిత్సకు సంబంధించి మరికొన్ని పరీక్షలు చేస్తున్నామనీ, అందుకే మరికొన్ని రోజులపాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని సీఎంను తాము కోరినట్టు వైద్యులు తెలిపారు.