వలస ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి నష్టమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బొత్స.. వలస ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఆత్మస్థైర్యం లేకే సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలోకి వెళుతున్నారని ఆయన విమర్శించారు. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిని కోరినట్లు బొత్స తెలిపారు. శాంతి భద్రతలు, నిబంధనలకు లోబడి ఎవరైనా ఎక్కడైనా సమావేశాలు పెట్టుకోవచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాంటి సమావేశాలకు ప్రభుత్వం తప్పకుండా అనుమతిస్తుందన్నారు. మనసులో ఏదో పెట్టుకునే కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ విమర్శలు చేస్తున్నారన్నారు.
Aug 27 2013 7:40 PM | Updated on Mar 21 2024 8:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement