డ్రంకన్ డ్రైవ్, మితిమీరిన వేగం ఓ యువతి ప్రాణాన్ని బలిగొంది. బర్త్‌డే పార్టీకి వెళ్లిన ఆమె.. కారులో స్నేహితులతో తిరిగి వస్తూ ప్రమాదంలో కన్నుమూసింది. కరీంనగర్‌కు చెందిన రామ్మోహన్ కుమార్తె లక్ష్మిహాస్య(20) నారాయణమ్మ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఆదివారం గీతం ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన తన స్నేహితుడు విశాల్ పుట్టిన రోజు కావడంతో ఫ్రెండ్స్‌తో కలసి బయల్దేరింది. సంతోషి, రోహిత్, నిధి, విశాల్‌లతో కలిసి నెక్లెస్‌రోడ్‌లోని ఓహ్రీస్ రెస్టారెంట్‌కు వచ్చారు.