రైలులో ప్రయాణిస్తుండగా తన బ్యాగును ఎలుక కొరికేసిందని ప్రముఖ మరాఠి నటి నివేదిత సరాఫ్.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. రైళ్లలో ఎలుకల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రైలులో తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రికి వివరించారు. సెప్టెంబర్ 22న లాతూర్ ఎక్స్ప్రెస్ లో ఏసీ బోగీలో ఆమె ప్రయాణించారు. తన బ్యాగును తల పక్కన పెట్టుకుని నిద్రపోయింది. లేచి చూసేసరికి ఆమె బ్యాగును ఎలుక కొరికేసింది.