ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. పోలీసులు, జ‌వాన్లపై మావోయిస్టులు కాల్పులు జ‌రిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పుల‌కు దిగ‌డంతో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు. అనంత‌రం ఘ‌ట‌నాస్థలం నుంచి పోలీసులు ప‌లు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాలు కూబింగ్ నిర్వహిస్తున్న స‌మ‌యంలో ఈ కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో బ‌ల‌గాలు ఇంకా కూంబింగ్ కొన‌సాగిస్తున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top