ఎవరు ఎన్ని కేసులు పెట్టినా తనను ఎవరూ ఏమీ చేయలేరని, తెలంగాణ ప్రభుత్వం తనపై ఏ కేసూ పెట్టలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం అనంతరం సురేష్ బహుగుణ పాఠశాల మై దానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు