సింగం-3 మరోసారి వాయిదా? | Release of Suriya's Singam 3 postponed again | Sakshi
Sakshi News home page

Jan 24 2017 6:41 AM | Updated on Mar 21 2024 8:43 PM

నటుడు సూర్య చిత్ర విడుదల మరోసారి వాయిదా పడిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సీ–3. అనుష్క, శ్రుతీహాసన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సూపర్‌హిట్‌ చిత్రం సింగంకు సిరీస్‌గా తెరకెక్కిన మూడో చిత్రం అన్నది తెలిసిందే. కమర్షియల్‌ దర్శకుడు హరీ తాజా చిత్రం ఇది. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం సీ–3. ఇప్పటికే రెండు సార్లు పేర్లను, రెండు సార్లు విడుదల తేదీలను మార్చుకున్న ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. సూర్య మరోసారి పోలీస్‌ అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రలో నటించిన ఈ సీ–3 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్ర ట్రైలర్‌ థియేటర్లలో దుమ్మురేపుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement