అప్పుల్లో పీకల్లోతు కూరుకుపోయిన గ్రీస్ భవితను తేల్చే రిఫరెండం నేడు(ఆదివారం) జరగనుంది. మరో బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి రుణదాతలు విధిస్తున్న షరతులకు ఓకే చెప్పాలా లేదా అన్నదానిపై జరుగుతున్న రిఫరెండంలో ప్రజలు దేనికి ఓటేస్తారోనని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. యూరోజోన్‌లో గ్రీస్ కొనసాగాలా లేదా అనేది రిఫరెండంపై ఆధారపడి ఉంది. షరతులకు తలొగ్గద్దని, షరతులకు ఒప్పుకోబోమని రిఫరెండంలో తేల్చి చెప్పాలని నిర్వహించిన ర్యాలీలో గ్రీస్ ప్రధాని సిప్రాస్ పాల్గొన్నారు. అయితే, గ్రీస్ ఆర్థిక పరిస్థితులతో విసిగిపోయిన సగం మంది ప్రజలు ఎలాగోలా బెయిలవుట్ ప్యాకేజీ వస్తే కష్టాలు తీరతాయనే ఉద్దేశంతో.. షరతులకు ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రెఫరెండంకి సంబంధించి నిర్వహించిన పోల్స్‌లో 44.8% మంది అనుకూలంగా, 43.4 % మంది వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది.